28 June, 2026 | 3:46 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

అర్ధరాత్రి నగరంలో సీపీ తనిఖీలు

08-10-2025 01:13 AM

 పరువురికి కౌన్సిలింగ్ హెచ్చరిక 

నిజామాబాద్ అక్టోబర్ 7 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో  శాంతి భద్రతల పరిరక్షణకై ప్రతిష్టమైన చర్యలు చేపడుతున్న నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక  తనిఖీలు నిర్వహించారు.  నగరంలోని పలు ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్ బస్టాండ్ లలో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించారు.  అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రధానమైన  రైల్వే స్టేషన్ , ఆర్టిసి బస్టాండ్ , గాంధీచౌక్ , నెహ్రూ పార్క్, శివాజీ నగర్ , కంటేశ్వర్,  దేవీ రోడ్డు , ఫ్లై ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.   

నిజామాబాద్ జిల్లాతో పాటు నగరం లో ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా బయటి ప్రాంతాలలో నుండి వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ ఆర్టిసి బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఉంటూ ఎలాంటి కారణము లేకుండా బయట తిరుగుతున్న వారిని సైతం సిపి తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా అసందర్భంగా కనిపించిన వారందరికీ  కౌన్సిలింగ్  నిర్వహించారు.  రాత్రి సమయాలలో మళ్లీ కనిపిస్తే వారిపై చట్టపరమైన కేసులు నమోదుచేస్తామని సిపి హెచ్చరించారు.