8 May, 2026 | 12:35 AM

కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో మర్యాద పూర్వక భేటీ

08-05-2026 12:13 AM

నీలం మధు ముదిరాజ్ 

పటాన్‌చెరు, మే 7: పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహి స్తున్న ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, ఓటర్ల జాబితాలోని అక్రమాలను తక్షణమే ప్రక్షాళన చేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్ ను గురువారం సంగారెడ్డిలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న ఎన్నికల సంబంధిత సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి, సుదీర్ఘంగా చర్చించారు. ఇటువంటి అక్రమ ఓట్లను గుర్తించి తక్షణమే తొలగించాలని, అర్హులైన స్థానిక ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించినప్పుడే నిజమైన ప్రజా తీర్పు వెలువడుతుందని, ఇందుకోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.