calender_icon.png 5 February, 2026 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు

05-02-2026 12:00:00 AM

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): మేడారం శ్రీ సమ్మక్క- సారల మ్మ మహా జాతర హుండీల లెక్కింపునకు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. నేటి నుండి లెక్కింపులు చేపట్టనున్నారు. మేడారం నుంచి మంగళవారం హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. దేవాదాయ శాఖ అధికారులు జాతరలో 828 హుండీలను ఏ ర్పాటు చేశారు. వాటిలో 788 ఉండిలను లెక్కించనున్నారు.

40 హుండీలను తిరుగు వారం వరకు గద్దెలపై ఉంచనున్నట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామల సు నీత తెలిపారు. హుండీల లెక్కింపు పర్యవేక్షణ అధికారిగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణ ప్రసాద్ వ్యవహరించనున్నారు. దేవాదాయ శాఖకు చెందిన సుమా రు 200 మంది ఉద్యోగులు, సేవా సమితికి చెందిన మరో 300 మందితో హుండీల లెక్కింపు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.