7 May, 2026 | 2:05 PM

Breaking News

కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •   ‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?   •   కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •  

హిజ్రాల ఆగడాలకు చెక్

20-11-2025 08:20 PM

అమీన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో 60 మంది హిజ్రాలకు కౌన్సెలింగ్

వివాహాలు, శుభకార్యాలయాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కేసులు నమోదు చేస్తాం

జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్

అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా ఎస్పీ  పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు అమీన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుమారు 60 మంది హిజ్రాలకు అమీన్ పూర్ ఎస్‌హెచ్‌ఓ నరేష్, ఇన్స్పెక్టర్ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివాహాలు, శుభకార్యాలయాలు, ఇతర ప్రజా ప్రదేశాలలో ప్రజలను బయబ్రాంతులకు గురిచేస్తూ, నేర పూరిత చర్యలకు దిగుతూ ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు డబ్బు వసూలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

చట్టానికి లోబడి, సమాజంలో అందరిలా సాదారణ జీవన విధానాన్ని అనుసరించాలని సూచించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ...శుభకార్యాలయాలు, వ్యాపార సంస్థలు, ఇళ్లకు వెళ్లి ప్రజలను బయబ్రాంతులకు గురిచేస్తూ, నేర పూరిత చర్యలకు దిగుతూ బలవంతపు డబ్బు వసూలు చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కేసులు నమోదు చేయాలని ఎస్‌హెచ్‌ఓలకు ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగినట్లయితే, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.