1 July, 2026 | 6:35 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

పత్తి కొనుగోలు సీసీఐ తిరకాసు

24-02-2026 01:02 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): పత్తి పండించే అన్నదాతకు కష్టాలు వీడటం లేదు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలతో దిగుబడి తగ్గి కుదేలవుతుంటే, మరోవైపు ప్రభుత్వ కొనుగోలు సంస్థ ‘కాటన్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా’ (సీసీఐ) విధిస్తున్న కఠిన నిబంధనలు రైతులను కుంగదీస్తున్నాయి. నాణ్యత, తేమ శాతం పేరిట అధికారులు పెడుతున్న కొర్రీలతో మద్దతు ధర దక్కక రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. పత్తి కొనుగోళ్లలో  సీసీఐ గడువు పెంచినప్పటికీ నాణ్యత పేరిట కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు.

ఈనెల 20 వరకే పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ ప్రకటించినప్పటికీ ఆ గడువురు ఈనెల చివరికి పెంచింది. కిసాన్ యాప్‌లో రైతులు స్లాట్ బుక్ చేసుకొని మార్కెట్ యార్డ్ కు రాగా నాణ్యత పేరిట కొనుగోలులకు సీసీఐ అధికారులు ముందుకు రాలేదు. సోమవారం ఒకే బండి కాటా చేయడంతో రైతులు మార్కెట్ యార్డ్‌లో నిరసన వ్యక్తం చేశారు. పత్తి నాణ్యతగా ఉన్నా కూడా కొనుగోళ్లకు పాసింగ్ ఇవ్వ డం లేదని మండిపడ్డారు. రైతులకు అండగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిన్ రెడ్డి సీసీఐ అధికారులతో మాట్లాడా రు. ఎలాంటి తిరకాసులు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.