23-02-2026 02:13:06 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): అల్ప పీడన ప్రభావంతో ఆదివారం మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, బయ్యారం మండలాల్లోని కార్లాయి, బిరవోని మండువ గ్రామాల్లో పలువురు రైతులకు చెందిన మొక్క జొన్న పైరు నేలవాలింది. చేతికందే దశలో ఉన్న పంట నేల మట్టం కావటంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.