calender_icon.png 23 February, 2026 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మురళీకృష్ణుడిగా నారసింహుడు

23-02-2026 02:14:37 AM

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): యాదాద్రి లక్ష్మీనర సింహస్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఆదివారం ఉద యం స్వామివారిని మురళీకృష్ణుడిగా అలంకరించి, మాడవీధులలో ఊరేగించారు. భక్తులు భక్తిపారవశంతో స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి స్వామివారిని పొన్నవాహన సేవలో అలంకరించి భక్తుల దర్శనార్ధం తిరువీధుల్లో ఊరేగించారు. కాగా ఆదివారం వివిధ సేవ ల ద్వారా ఆలయాలనికి రూ.39, 86,971 ఆదా యం సమకూరినట్టు ఆలయ అధికారి తెలిపారు.