16 April, 2026 | 4:05 AM

బోయిన్‌పల్లిలో కార్డన్ సెర్చ్

16-04-2026 12:23 AM

యాంటీ సోషల్ కార్యకలాపాలపై పోలీసుల కట్టడి

సికింద్రాబాద్,ఏప్రిల్ 15(విజయక్రాంతి): మల్కాజిగిరి జోన్ పరిధిలోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు బుధవారం సాయంత్రం విస్తృతంగా కమ్యూనిటీ కనెక్ట్, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మల్కాజ్గిరి జోన్ డీసీపీ ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్ర మంలో సుమారు 300 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలతో మమేకం కావడం, వారి సమస్యలు తెలుసుకో వడం, యాంటీ సోషల్ కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ము ఖ్యంగా డ్రగ్స్ వినియోగం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం,అనుమా నాస్పద కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు.హస్మత్పేట్ సహా పలు ప్రాంతాల్లో ఇళ్లను తనిఖీ చేసి, వాహ నాల పరిశీలన చేపట్టారు.

ఈ సందర్భం గా సరైన పత్రాలు లేని లేదా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు,అనుమానాస్పద వస్తువులను స్వాధీ నం చేసుకున్నారు. అందులో 32 ద్వి చక్రాల వాహనాలు,ఒక ఆటో ,100 ఆక్సిటోసిన్ బాటిళ్లు ,ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్,ఒక హుక్కా పాట్ స్వాధీనం చేసుకున్నా రు.ఈ ఆపరేషన్లో డీసీపీ శ్రీధర్ తో పాటు అదనపు డీసీపీ,ఏసీపీలు గోపాలకృష్ణమూర్తి, రమేష్ ,బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు, డీఐ, ఎస్‌ఐలు ఇతర స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.