25 April, 2026 | 9:04 PM

సాంకేతిక పరిజ్ఞానంపై సమన్వయం ఎంతో ముఖ్యo

25-04-2026 07:37 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): సాంకేతిక పరిజ్ఞానం పై సమన్వయం ఎంతో ముఖ్యమని జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె. వెంకటేశ్వరరావు అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, అదిలాబాద్ డివిజన్ పరిధి, ఘనపూర్ లోని కేపీఆర్‌ఐటీ లో మొదటి ద్వితీయ సమావేశం నిర్వహించారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,  కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న “ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫ్యూచర్ ఫ్రంటియర్స్ ఇన్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ సైన్సెస్ అండ్ మేనేజ్‌మెంట్  మొదటి రోజు మధ్యాహ్న ద్వితీయ సమావేశం ఘనంగా నిర్వహించబడింది.

ఈద్వితీయ సమావేశానికి ముఖ్య అతిథిగా జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె. వెంకటేశ్వరరావు హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో పరిశోధన, పరిశ్రమ అవసరాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం మధ్య సమన్వయం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ పరిశోధనలను సమాజ ప్రయోజనాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వైస్ ఛైర్మన్ కొమ్మూరి ప్రశాంత్, డైరెక్టర్ స్ట్రాటజీ కొమ్మూరి దివ్య, డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ కె. శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. శ్రీనాథ్ కశ్యప్ పాల్గొని సదస్సు విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.