రైతుల సౌకర్యార్థం సహకార కేంద్ర బ్యాంక్
ఎమ్మెల్యే పద్మావతి
మోతె, మే 19 (విజయ క్రాంతి): గ్రామీణ రైతుల సౌకర్యార్థం సహకార కేంద్ర బ్యాంకు వారు మండల కేంద్రంలో నూతన బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం హర్షనీయమని ఎమ్మెల్యే పద్మావతి తెలిపారు. సోమవారం మోతె మండల కేంద్రంలో సహకార కేంద్ర బ్యాంక్ నూతన బ్రాంచ్ తో పాటు మామిల్లగూడెం లో అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం, 33/11 కె.వి విద్యుత్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. రైతులు సహకార బ్యాంకులో పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా బ్యాంకును ఏర్పాటు చేయడం సంతోష కరమని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మామిల్లగూడెంలో కోటి 28 లక్షలతో ఏర్పాటుచేసిన అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం, విద్యుత్ సరఫరా లో సమస్యలు తలెత్తకుండా పునర్నిర్మాణం చేసిన 33/11 కె.వి విద్యుత్ ఉప కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి మండలంలోని సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ శంకర్రావు, జిఎం నర్మదా, నాబార్డ్ రవీందర్ నాయక్, డి జి ఎం కురు నాయక్, ఏజీఎం వెంకటేశ్వర్లు, బ్యాంకు మేనేజర్ మాధవి, బ్యాంకు డైరెక్టర్లు కొండపల్లి వెంకటరెడ్డి, శ్రీధర్ రెడ్డి, విద్యుత్ అధికారులు డి ఈ వెంకట కృష్ణయ్య, ఏడి రామ నాయక్, ఏ ఈ శాంతి కుమారి, గ్రామ సర్పంచ్ కొరివి నాగమణి, మండల పార్టీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, గురువారెడ్డి, మాజీ జడ్పీటీసీలు మాతృ నాయక్, పుల్లారావు, పులి ఈదయ్య గౌడ్, సామా చిన వెంకట్ రెడ్డి లక్ష్మారెడ్డి ,వెంకటేశ్వర్లు , యల్లయ్య, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.






