13 April, 2026 | 3:00 AM

అయోధ్య రామాలయ నిర్మాణం సంపూర్ణం

13-04-2026 01:28 AM

ఆలయ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా

లక్నో, ఏప్రిల్ 12: రామభక్తుల చిరకాల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది. అయోధ్య శ్రీరాముని ఆలయ నిర్మాణం పూర్తయినట్లు ఆలయ నిర్మాణ కమిటీ ఆదివారం ప్రకటించింది. రూ. 1800 కోట్లతో నిర్మాణం పూర్తి చేశామని చైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. 2020లో ఆలయ నిర్మాణ బాధ్య తను తమకు అప్పగించినా ఏర్పాట్లు మా త్రం చాలా ముందునుంచే మొదలయ్యాయన్నారు. న్యాయపరమైన చిక్కుముడులు తది తర కారణాల రీత్యా ఆలస్యమైనా, దైవ నిర్ణయంతో నిర్మాణం పూర్తయిందన్నారు.

కాగా శ్రీరాముడి విగ్రహాన్ని దాదాపు నాలుగేళ్లపాటు తాత్కాలిక నిర్మాణంలో ఉంచారు. ప్ర స్తుతం ఆ ప్రదేశంలో ‘అఖండ జ్యోతి’ని నిరంతరం వెలిగిస్తున్నారని మిశ్రా తెలిపారు. తాత్కాలిక ఆలయం చెక్క నిర్మాణాన్ని భద్రపరిచారు. ఆ కాలంలో ఉపయోగించిన గు డారాన్ని కూడా అలాగే ఉంచనున్నారు. భక్తులను ఆకర్షించేందుకు జ్యోతి ఇరవై నాలుగు గంటలూ వెలుగుతూ ఉండేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏర్పా ట్లు చేశారు. నిర్మాణం పూర్తవడంతో యాత్రికుల రాకపోకలను నిర్వహించడం, ఈ ప్రదే శం చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను పరిరక్షించడంపై ఆలయ కమిటీ దృష్టి సారించింది.