10-02-2026 07:18:56 PM
జైనూర్,(విజయక్రాంతి): జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన వంటశాల షెడ్డు నిర్మాణానికి మంగళవారం జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రకాష్ మాట్లాడుతూ... మధ్యాహ్న భోజన పథకం వంట చేయడానికి ఉపాధి హామీ పథకం ద్వారా రెండు లక్షల 60 వేలతో వంటశాల షెడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని షెడ్ ఎంతో ఉపయోగపడుతుందని షెడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జైనూర్ ఉపసర్పంచ్ డోంగ్రే ప్రకాష్, వార్డు సభ్యులు షేక్ రహీం, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ లింగేశ్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్రం రవీందర్, తదితరులు పాల్గొన్నారు.