25 February, 2026 | 5:21 PM

5 లక్షలతో గొల్ల కురుమ సంఘం అదనపు భవన నిర్మాణ ప్రారంభం

25-02-2026 03:15 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో గొల్ల కురుమ (యాదవ) సంఘం అదనపు భవన నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. రూ.5 లక్షల నిధులతో నిర్మించనున్న ఈ భవనం సంఘ కార్యకలాపాలకు కేంద్రంగా ఉపయోగపడనుంది. సర్పంచ్ గదగొని సాగర్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

కార్యక్రమంలో ఎఏంసీ వైస్ చైర్మన్ నేరళ్ల నరసింగం గౌడ్, ఉపసర్పంచ్ యాస సందీప్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, మహిళా మండలం అధ్యక్షురాలు ధర్మారెడ్డి హారిక రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు అసాని మహిపాల్ రెడ్డి, నాయకులు సత్తు శ్రీనివాస్ రెడ్డి, లింగాల భూపతి, మూర్తి మహిపాల్ రెడ్డి, అండెం చంద్రారెడ్డి, వార్డ్ సభ్యులు బోడపట్ల రాకేష్, బండి రేణుక పాల్గొన్నారు. యాదవ సంఘం అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్ సహా పలువురు సభ్యులు హాజరై, భవనం త్వరితగతిన పూర్తి చేయాలని ఆకాంక్షించారు.