25 July, 2026 | 10:49 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

కామారెడ్డిలో కానిస్టేబుల్ ఆత్మహత్య

27-10-2025 04:26 PM

కామరెడ్డి: భార్య కాపురానికి రావటంలేదని మనస్తాపం చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా, గర్గుల్ శివారులో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మద్దికుంట గ్రామానికి చెందిన రేకులపల్లి జీవన్ రెడ్డి(37) ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. జీవన్ కి ముస్తాబాద్ మండలం మొరాయిపల్లి గ్రామానికి చెందిన చందనతో వివాహం జరిగింది.వీరికి మోక్ష, కృతిక అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. గత రెండు మూడేళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగగా, ఏడాది క్రితం భార్య తన పుట్టింటికి వెళ్లింది. కాపురానికి రవాలని ఎన్నిసార్లు అడిగినా రాకపోగా.. ఇటీవలే విడాకుల పత్రాలు పంపించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జీవన్ ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని తన బైక్ పై ఇంటి నుంచి బయలుదేరాడు. మార్గం మధ్యలో  కామారెడ్డి మండలం గర్గుల్ శివారులోని అడ్లూర్ గోదాం వద్ద ఉన్న రాధస్వామి సత్సంగ బ్యాన్ ఆశ్రమం వెనుకాల పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అట్టుగా వెళ్లిన గొర్రెల కాపరి పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ మృతదేహం ఉందని చెప్పాడు. గొర్రెల కాపరి సమాచారంతో  కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), రూరల్ సీఐ రామన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించి, పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.