9 May, 2026 | 1:09 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

కార్యాలయాల ఏర్పాటుపై పరిశీలన

29-11-2025 12:00 AM

మేడ్చల్ అర్బన్, నవంబర్ 28  (విజయక్రాంతి):మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంతో పాటు మండల రెవెన్యూ తహసిల్దార్ కార్యాలయాలను మేడ్చల్ మండల పరిషత్ జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు తోటకూర వజ్రష్ యాదవ్ పరిశీలించినట్లు మేడ్చల్ మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడి సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు మండల రెవెన్యూ తహాసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ మండల పరిషత్ కార్యాలయాలకు మార్చడానికి రాష్ర్ట ముఖ్య మంత్రితో మాట్లాడుతానని చెప్పినట్టు తెలిపారు.ప్రజలకు పారదర్శకమైన వేగవంతమైన సేవలు అందేలా కార్యాలయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

అదేవిధంగా సాధారణ ప్రజలు ఒకే చోట అన్ని ప్రభుత్వ సేవలు పొందేల కార్యాలయాలను రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని వజ్రష్ యాదవ్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టిఏ సభ్యులు తూముకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి.గోమారం రమణారెడ్డి.వరదా రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..