17 May, 2026 | 2:45 AM

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం

17-05-2026 01:23 AM
  1. ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు 
  2. కేరళం కాంగ్రెస్ నేత చెన్నితాల రమేష్‌ను కలిసిన వీహెచ్  

హైదరాబాద్, మే 16(విజయక్రాంతి): వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రభుత్వ సలహాదారు, పీ సీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం కేరళం రాష్ట్ర కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, ఎమ్మె ల్యే చెన్నితాల రమేష్‌ను వీహెచ్ కేరళంకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కేరళంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చెన్నితాల రమేష్  కృషి ఎంతో ఉందని, ఆ యనను అభినందించారు.

ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌తో కేరళం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారని తెలిపారు.  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతాలు, కులాల పే రుతో చిచ్చు పెడుతోందని ఆయన విమర్శించారు. కేరళంలో బీజేపీ ఎన్ని కుట్రలు చేసి నా ప్రజలకు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోనూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.