calender_icon.png 13 February, 2026 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనీస వసతులు కల్పించలేదని జర్నలిస్టుల ధర్నా

13-02-2026 01:59:26 PM

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధు మోహన్  హామీతో ఆందోళన విరమించిన జర్నలిస్టులు 

కామారెడ్డి,(విజయక్రాంతి): కౌంటింగ్ కేంద్రంలో జర్నలిస్టులకు(Journalists protest) కనీస వసతులు కల్పించలేదని శుక్రవారం కౌంటింగ్ కేంద్రం ఎదుట జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. జర్నలిస్టులకు ప్రత్యేకంగా కూర్చోవడానికి కుర్చీలు వేయలేదని, ఫలితాలు చూసేందుకు టీవీ అమర్చలేదని, కనీసం నీటి సౌకర్యం కల్పించలేదని ఆందోళన చేశారు. డిపిఆర్ఓ తీరుపై అగ్రహాo వ్యక్తం చేశారు.

దీంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్ జర్నలిస్టుల ఆందోళన వద్దకు వచ్చి సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తమ దృష్టికి రాకపోవడం వల్ల ఇబ్బంది ఏర్పడిందని వెంటనే ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు రజనీ కాంత్, వేణుగోపాల చారి, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, సిద్ధి రాములు, విజయానంద్, స్వామి, ఆశన్న, రాజు, తదితరులు పాల్గొన్నారు.