మాజీ ఎంపీపీ జగన్ మోహన్‌రావుకు పరామర్శ
త్వరగా కోలుకుని ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్ష
కరీంనగర్, ఆగస్టు 30(విజయ క్రాంతి): ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొందిన ముత్తారం మాజీ ఎంపీపీ నాగినేని జగన్ మోహన్‌రావును మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ ఆదివారం పరామర్శించారు. చికిత్స అనంతరం జగన్ మోహన్‌రావు కరీంనగర్‌కు వచ్చిన సందర్భంగా తొట్ల తిరుపతి యాదవ్ ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఉపాధ్యక్షులు ఎల్లే రామ్మూర్తి, మాజీ జడ్పిటిసి గంట రమణరెడ్డి, మాజీ ఎంపీటీసీ మురుముర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య, లద్నాపూర్ మాజీ సర్పంచ్ బి.వి. స్వామి గౌడ్, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కండె పోషం, బీసీ సెల్ అధ్యక్షులు బండారి సదానందం, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గొర్రె నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నా






