09-02-2026 12:41:04 PM
మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బిఆర్ఎస్ బిజెపి, భారీ ప్రచారం
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ ఎన్నికల గడువు సమిపిస్తుండటంలో స్థానికంగా మరిపెడ మున్సిపాలిటీ సిటును దక్కించుకొనడం లో అన్ని పార్టీలు తమ తమ ప్రచార నాయకులను రంగంలోకి దించుతున్నారు. అది అలా ఉండగా ఏకంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ప్రచారం చేయడంలో ప్రతి పక్షాలు ఐన బిఆర్ఎస్, బిజెపిలు దీనిని తప్పు పట్టాయి. రాష్ట్రంలో కేవలం లంబాడీల ఓటు బ్యాంకు కోసమే వాళ్లకి ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారని, ప్రతిపక్షాలు అన్నాయి.
అది అలా ఉండగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డిని మరిపెడ మరియు డోర్నకల్ మిన్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కేవలం బిఆర్ఎస్ తోనే డోర్నకల్, మరిపెడకు మునిసిపాలిటీ అభివృద్ధి సాధ్యం అని, గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి గిరిజనులకు, గిరిజన రెసిడెన్సీయల్ స్కూల్లు, హాస్టల్స్, కల్యాణ లక్ష్మి,షాదిముబారక్,స్కాలర్ షిప్ లు,ఇలా ఎన్నో చేసాము అని అన్నారు. అలాగే బీజేపీ కూడా కేవలం ప్రజలను ఓటు బ్యాంకు లాగానే వాడుకొంటున్నారని అన్నారు. ఎప్పటికి బిఆర్ఎస్, బిజెపితో పొత్తు పెట్టుకోబోదు అని ఆయన అన్నారు. రెండు మున్సిపాలిటీలో విజయంలో అన్ని పార్టీ నాయకులు తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు.