calender_icon.png 10 February, 2026 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్

10-02-2026 12:44:08 AM

  1. పట్టణ అభివృద్ధి మంత్రి శ్రీధర్ బాబుతోనే సాధ్యం

మంథనిలో విస్తృత ఎన్నికల ప్రచారంలో టీపీపీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు

మంథని ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి)  మంథని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు క్లీన్‌స్వీప్ చేయబోతున్నారని, మంథని పట్టణ అభివృద్ధి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బా బుతోనే సాధ్యమని గత మూడు రోజులుగా మంథనిలో విస్తృత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీపీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు తెలిపారు. మంథని పట్టణంలోని 13 వార్డులలో శ్రీను బాబు అన్ని తానై విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇంటి ఇంటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ... మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే అధిక నిధులు తీసుకువచ్చి మంథని ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారని వివరించారు.  శ్రీను బాబుకు మంథని పట్టణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ఎన్నికల్లో 13 వార్డులో 13 మందిని గెలిపిస్తామని ప్రజలు తమకు హామీ ఇచ్చారని, ప్రజల ఆశీర్వాదాలతో మంత్రి శ్రీధర్ బాబు చేసిన అభివృద్ధితో మంత్రి పట్టణాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజ లు ఆలోచించి చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని అన్నారు.