22 July, 2026 | 2:00 AM

అరిథ్మియా చికిత్సపై కిమ్స్‌లో సదస్సు

21-07-2026 12:00 AM
  1. దేశవ్యాప్తంగా ప్రముఖ హార్ట్ రిథమ్ నిపుణుల హాజరు
  2.    500 మంది కార్డియాలజిస్టులు, వైద్యులు, ఫెలోలకు శిక్షణ

హైదరాబాద్, జూలై 20(విజయక్రాంతి): గుండె స్పందనలో ఏర్పడే అసాధారణ సమస్యలు (అరిథ్మియా) గుర్తింపు, చికిత్సలో తా జా పరిణామాలపై వైద్యులకు అవగాహన కల్పించే లక్ష్యంతో అరిథ్మియారీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సొసైటీ (ఏఆర్ టిఎస్) ఆధ్వర్యంలో, కిమ్స్ హాస్పిటల్స్ సహకారంతో శనివారం సికిందరాబాద్ మినిస్టర్ రోడ్డులోని కిమ్స్ ఆసుపత్రిలో ఒకరోజు జాతీయ అరిథ్మియా సింపోజియం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది కార్డియాలజిస్టులు, ఫిజీషియ న్లు, కార్డియాలజీ ఫెలోలు ఈ సదస్సులో పాల్గొన్నారు.

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రోఫిజియాలజిస్టులతో పాటు అంతర్జాతీయ ని పుణుడు కూడా అధ్యాపక బృందంలో పా ల్గొని ప్రసంగించారు. సింపోజియం కోర్సు డైరెక్టర్, కిమ్స్ హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ ఎలక్ట్రోఫిజియాలజీ అండ్ పేసింగ్ డివిజన్, ఏఆర్ టీఎస్ అధ్యక్షుడు డాక్టర్ బి. హైగ్రీవ్ రావు మాట్లాడుతూ, గుండె స్పందన సంబంధిత వ్యాధుల చికిత్సలో విజయవంతమైన ఫలితాలు సాధించాలంటే కేవలం చికిత్సా విధా నాలు మాత్రమే కాకుండా వైద్యులు సరైన సమయంలో సరైన క్లినికల్ నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కీలకమన్నారు.

రోగి లక్ష ణాలు, ఆధునిక నిర్ధారణ పరీక్షలు, అంతర్జాతీయ వైద్య మార్గదర్శకాలను సమన్వయం చేస్తూ చికిత్స నిర్ణయాలు తీసుకునే నైపుణ్యా న్ని పెంపొందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ శిక్షణ రోజువారీ వైద్య సేవల్లో మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నా రు.

సింపోజియాన్ని ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్, చీఫ్ క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ సంబిత్ సాహూ మాట్లాడుతూ, హార్ట్ రిథమ్ నిపుణుల సేవ లు అందుబాటులోకి రావడంతో కార్డియాలజీ రంగంలో రోగులకు అందుతున్న వైద్య సేవల ప్రమాణాలు మరింత మెరుగుపడ్డాయన్నారు. యువ వైద్యులు దేశంలోని ప్ర ముఖ హార్ట్ రిథమ్ నిపుణుల నుంచి నేర్చుకునే ఇటువంటి అవకాశాలను పూర్తిగా సద్వి నియోగం చేసుకోవాలన్నారు.

కిమ్స్‌లో డాక్టర్ హైగ్రీవ్ రావు నాయకత్వంలో ని అరిథ్మియా విభాగం నిర్వహిస్తున్న పరిశోధనలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని, తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్సా విధానాల అభివృద్ధికి అవి దోహదపడు తున్నా యని డాక్టర్ సంబిత్ సాహూ తెలిపారు.  ప్ర ముఖ నిపుణుల అనుభవాలను పంచుకునే ఈ సదస్సు వైద్యుల విజ్ఞానాన్ని మరింత వి స్తరించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.