బాధిత కుటుంబానికి పరామర్శ
27-05-2026 12:25 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో మంగళవారం రాత్రి కురిసిన జోరుగాలి వానకు ఇంటి పైకప్పు కొట్టుకుపోయి నిరాశ్రయులైన కుటుంబాన్ని బుధవారం మాజీ మున్సిపల్ చైర్మన్, డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం పరామర్శించారు. పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన బోగు నరసయ్య, రవి, గార్ల ఇంటి పైకప్పు పూర్తిగా లేచిపోగా వారు నిరాశ్రయులయ్యారు. ఆ కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ. 500 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు .ఖానాపూర్ ఎమ్మెల్యే సహాయంతో రెండవ విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట కౌన్సిలర్లు నిమ్మల రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం ,పట్టణ అధ్యక్షులు గంగాధర్, జమాల్ కురేసి ,కస్తూరి మహేష్, జన్నారపు శంకర్, రెవిన్ ఇన్స్పెక్టర్ నగేష్ తదితరులు ఉన్నారు.






