గ్రామ పంచాయతీలో సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తాం: తాహశీల్దార్
మఠంపల్లి,(విజయక్రాంతి): గ్రామ సభల ద్వారా ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని మఠంపల్లి మండలం కొత్త దొనబండ తండా గ్రామ సర్పంచ్ బాణోత్ అరుణ దేశ్ పాండు అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ముగింపు సభలో ముఖ్య అతిథిగా మఠంపల్లి తాహాశీల్దార్ లావురి మంగ రాథోడ్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలపై తక్షణమే పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
అదే విధంగా వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుందని ఒకే రకమైన పంట సాగు చేయకుండా పంట మార్పిడి చేయాలని రైతులకు సూచించారు. జాబ్ కార్డ్ లో పేర్లు నమోదు ఉన్న వారందరికీ 125 రోజుల పని దినాలు కల్పిస్తామని, పారిశుధ్యం,త్రాగు నీరు అందించే మిషన్ భగీరథ పథకాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా 100 శాతం అమలుకు కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు.అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ జన రంజక పథకాలను ప్రజా ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని గ్రామ ప్రజలకు వివరించారు.
గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అందు కొరకు గ్రామ ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామసభలో వివిధ శాఖల అధికారులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తాహశీల్దార్ వెంట పంచాయతీ ఉప సర్పంచ్,పాలక వర్గం సభ్యులు,ఏపీఓ ఉమ,ఏఈఓ త్రివేణి, మిషన్ భగీరథ ఏఈఈలు, కార్యదర్శి నరేష్, అంగన్వాడీ టీచర్ సంతోషి కుమారి,వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






