9 May, 2026 | 1:07 PM

Breaking News

కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

విద్యతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం

24-01-2026 05:36 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): విద్యతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని తాడ్వాయి ఎస్సై స్రవంతి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ఉన్నత పాఠశాల ఆవరణలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. లింగ విభేదం లేకుండా విద్యను అభ్యసించినట్లయితే సమాజంలో మంచి అభివృద్ధి సాధిస్తామని తెలిపారు. విద్య జాతి నిర్మాణంలో ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు. సైబర్ నేరాల పై జాగ్రత్తగా ఉండాలన్నారు.

మానవ అక్రమ రవాణా సమాజంలో ఎంతో కీడును తెచ్చిపెడుతుందన్నారు. బాలికలు బాగా చదువుకొని సమాజానికి మంచి చేయాలని సూచించారు. ఎంఈఓ రామస్వామి మాట్లాడుతూ.. బాలికలు బాగా చదువుకొని సమాజానికి మంచి చేయాలని సూచించారు. తమ లక్ష్యాలను సాధించడానికి విద్య అనేది ఒక ఆయుధంగా పనిచేస్తుందన్నారు. బాలికలు తమ భద్రతపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటే భద్రత పట్ల అప్రమత్తంగా ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బాలికల విద్య ఇన్చార్జి శ్వేత ఉపాధ్యాయులు హేమంత్ కుమార్,గిరి, రమేష్, బాబురావు, శ్రీహరి, రాజు రాజు రెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు