ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్‌రావుపై సీపీకి ఫిర్యాదు
04-03-2026 12:37 AM
నిజామాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): నందిపేట్ మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ సంతోష్ గౌడ్ ఏ ఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ రావు పై ఫిర్యాదు చేశారు కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొంటూ ఊరిలో ఉన్న ప్రశాంత వాతావరణానికి ఇబ్బందులు కలిగిస్తూ ఊరిలో గొడవలు సృష్టిస్తున్నాడ ని సీపీ సాయి చైతన్యకు కి ఫిర్యాదు చేశారు. ఇతనిపై గతంలో దొంగ నోట్ల కేసు, ఎస్సీ ఎస్టీ కేసు లు ఉన్నాయని వారు సీపీకి వివరించారు. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపి గారికి వివరించారు.




