టీపీఓపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
ఘట్ కేసర్, జూన్ 29 (విజయక్రాంతి) : అక్రమ నిర్మాణాలను పట్టించుకోని టీపీఓ అధికారులపై చర్యలు తీసుకోవాలని టిడిపి జిల్లా నాయకులు, ఘనపూర్ మాజీ సర్పంచ్ వేముల సంజీవ గౌడ్ సోమవారం ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి కి ఫిర్యాదును అందజేశారు. ఘనపూర్ గ్రామ రెవెన్యు పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అక్షమ నిర్మాణాలు చేపడుతున్నారని గత మూడు పరిహనాలు దాదాపు రెండు నెలలుగా సర్కిల్ కార్యాలయoలో ఫిర్యాదులు చేసినట్లు పేర్కొన్నారు.
పిల్లర్ల దశ నుండి పిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు కనీస చర్యలు తీసుకోవట్లేదని, తరచు సిబ్బంది వెళ్ళడం, రావడం తప్ప ఎలాంటి చర్యలు తెపట్టలేదన్నారు. ఇక్కడ ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే రెండు వందల అడుగుల దారి నుండి నల్ల, డ్రైనేజ్ కనెక్షన్ సైతం పూర్తి చేసారు.
అనేక మంది అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికి నల్ల, డ్రైనేజ్ ఇవ్వడానికి అనుమతించని అధికారులు ఇక్కడ మాత్రము అసంపూర్తి నిర్మాణానికి అన్ని ముందే ఇచ్చి అధికారులు తమ ఘనతను చాటుకుంటున్నారని తెలిపారు. బిల్డర్లకు కార్పొరేషన్ పరిధిలోని ఆయా శాఖల సిబ్బంది అండగా ఉంటూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో బిల్డర్ ఆడింది ఆట పాడింది పాటగా మారిందని ఇప్పటికైనా తమరు స్పందించి బిల్డర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, అలానే అక్రమ నిర్మాణదారులకు అండగా ఉంటున్న టిపిఓ తో పాటు వారి సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కోరారు.






