పోలీసుల పహరా మధ్య...
బెల్లంపల్లి లో మావోయిస్టు నేత కటకం సుదర్శన్ వర్ధంతి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): సీపీఐ మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుధర్శన్ ఇలియాస్ దూలా దాదా మూడో వర్ధంతి పోలీసుల నిఘా, పహారా మధ్య ఆదివారం జరిగింది. పట్టణంలోని కన్నాల బస్తీలో కటకం సుదర్శన్ సోదరుడు, కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ కటకం సతీష్ ఇంట్లో తన అన్న మావోయిస్టు పార్టీ అగ్ర నేత సుదర్శన్ మూడో వర్ధంతి జరుపుకున్నారు. అమరుడు కటకం సుధర్శన్ చిత్ర పటానికి ఆయన సతీమణి మాజీ మావోయిస్టు పి. పద్మ,కటకం సుధర్శన్ సోదరుడు కటకం సతీష్ దంపతులు జమున కుటుంబ సభ్యులు కటకం సుధర్శన్ చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
కటకం సుధర్శన్ మూడో వర్ధంతి సందర్భంగా కన్నాల బస్తీలో సతీష్ ఇంటి ముందు పోలీసులు పహరా కాసారు. వర్ధంతి కార్యక్రమానికి మావోయిస్ట్ అనుబంధ సంఘాల నాయకులు,ఇటీవల అరెస్టు అయ్యి అజ్ఞాతం వీడిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్ జీ.సంగ్రామ్, చంద్రన్న వస్తారనే అనుమానంతో పోలీసులు గట్టి నిఘా ఉంచారు. వర్ధంతికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరు కావాల్సి ఉండగా కాలేదు. పోలీసు ఉన్నతాధికారుల అభ్యంతరం మేరకే రాలేదని సమాచారం..పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.






