13-02-2026 01:11:15 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : మూసీ పునరుజ్జీవంలో భాగంగా చేపట్టబోయే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రా జ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కేంద్ర మంత్రితో ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో ముఖ్యమంత్రి గురువారం భేటీ అయ్యారు. సుస్థిర పట్టణాభివద్ధి లక్ష్యాలతో పర్యావరణ హితం గా, స్వచ్ఛమైన నీటితో నది ప్రవహించేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపడుతున్న ట్లు కేంద్రమంత్రికి సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 100 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈసా..మూసీ నదుల సంగమ స్థలిలో 1948లో జాతిపిత మహాత్మాగాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. గాంధీజీ ఆశయాలైన శాంతి, ఐక్యత, సుస్థిరాభివృద్ధి, నిరాడంబర జీవనశైలిని అద్దం పట్టేలా గాం ధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు వివరించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్ర పంచస్థాయి విద్యా, సాంస్కతిక, ఆధ్యాత్మక, పర్యావరణ కేంద్రంగా నిలుపుతామన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో శాంతి చిహ్నం, జాతీయ మ్యూజియం, విజ్ఞాన కేంద్రం, చేనే త ప్రోత్సాహక కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఫిబ్రవరి నెలాఖరు లో చేసే భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయనకు సీఎం విజ్ఞప్తి చేశారు.