20 August, 2026 | 7:09 PM

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణను వేగవంతం చేయాలి

20-08-2026 06:09 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి,(విజయక్రాంతి): చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, మెగా సంస్థ అధికారులతో ప్రాజెక్టు భూ సేకరణ, కాలువల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... భూ సేకరణకు అవసరమైన భూముల సర్వేను వేగంగా పూర్తి చేసి నివేదికలు అందించాలని సూచించారు. కాలువల నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని, శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ పనులు పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.