28 August, 2026 | 8:21 PM

రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు

28-08-2026 07:32 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): నగరంలోని పారమిత ఉన్నత పాఠశాల విద్యార్ధులు 3వ తెలంగాణ రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలలో బంగారు, కాంస్య పతకాలు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ తెలిపారు. ఈ నెల 23న హైదరాబాద్ నగరంలోని అల్మాస్ గూడ లో సమాఖ్య అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రోప్ స్కిప్పింగ్ క్రీడా పోటీలలో భాగంగా అండర్ 10 విభాగంలో సి హెచ్ ఈశ్వర సాయి, అండర్ 8 విభాగంలో డి.నిఖిల్ లు బంగారు పతకాలు సాధించారు.

అలాగే ఎమ్ శ్రేయాన్స్ అండర్ 8 విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రాకేష్, రశ్మిత, అనుకర్ రావు, వినోదరావు, వియుఎం ప్రసాద రావు, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, ప్రశాంత్, కవిత సమన్వయకర్త శ్రీనాథ్, వ్యాయామ ఉపాధ్యాయులు రామక్రిష్ణ, కళ్యాణ్, మహేష్ లు అభినందించారు.