23 June, 2026 | 12:20 AM

భూముల సర్వేను పక్క చేయాలి

22-06-2026 07:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): భూముల రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ లక్ష్మణచందా మండలంలోని పలు గ్రామాలలో జరుగుతున్న భూముల రీ సర్వే, సర్వే తీరును పరిశీలించారు. ముందుగా ముని పెల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులు చేపట్టిన రీ సర్వే తీరును కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా సంబంధిత రెవెన్యూ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, సర్వేకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాలకు రెవెన్యూ మ్యాపులు లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని, రీ సర్వే ద్వారా గ్రామాల రెవెన్యూ మ్యాపులు సిద్ధం చేయాలన్నారు. అధునాతన కొలతల యంత్రాల సామాగ్రిని ఉపయోగించి సర్వే ప్రక్రియను నిర్ణీత సమయంలోగా పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు.

సర్వే చేయడం వల్ల రైతులకు సంబంధించిన భూముల సమస్యలు తొలగిపోతాయని అన్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సర్వే వివరాలను పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. అనంతరం చామన్ పల్లి గ్రామంలో జరుగుతున్న సర్వే తీరును పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సర్వే ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీవో దేవీదాస్, తహసిల్దార్ సరిత, డిప్యూటీ ఇన్స్ పెక్టర్ విటల్ రావు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.