20 April, 2026 | 5:25 PM

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు

20-04-2026 03:50 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): విద్యార్థులకు అందుతున్న సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. టేకులపల్లి మండలంలోని ఏకలవ్య, మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, పరిసరాల పరిశుభ్రత, భోజన నాణ్యతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో స్వయంగా మాట్లాడి అందుతున్న సదుపాయాలు, భోజన నాణ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థుల పఠన సామర్థ్యం, బోధనా నాణ్యత పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.