14 July, 2026 | 4:25 PM

Breaking News

రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •   బస్సులో టెన్త్ మెమో పోగొట్టుకున్న విద్యార్థి   •   ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •  

దేవరకొండకు సీఎం రేవంత్ రెడ్డి

06-12-2025 09:46 AM

హైదరాబాద్: తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శనివారం నాడు నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో(Devarakonda Mandal) పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు దేవరకొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి వెళ్లనున్నారు. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) ఏర్పాట్లను పరిశీలించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవరకొండ పట్టణంలో నిర్వహించనున్న భారీ సభకు 25 వేల మంది ప్రజలు హాజరయ్యే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.