9 May, 2026 | 9:49 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

కేంద్ర ఆర్థికమంత్రితో ముగిసిన సీఎం భేటీ

16-12-2025 02:51 PM

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. నిర్మల సీతారామన్ కు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ అందించిన సీఎం  యంగ్ ఇండియా స్కూళ్ల ఖర్చులను ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. యంగ్ ఇండియా స్కూళ్ల ప్రాజెక్టు డీపీఆర్ పంపాలని మంత్రి నిర్మల చెప్పడంతో డీపీఆర్ ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం.  యంగ్ ఇండియా స్కూళ్ల ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థికమంత్రికి వినతి పత్రం అందించారు.  రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రికి తెలిపారు.