calender_icon.png 21 February, 2026 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులను ప్రారంభించిన ముఖ్యమంత్రి

21-02-2026 04:56:18 PM

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా, అనంతగిరిలోని హరిత వ్యాలీ రిసార్ట్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఏఐసీసీ ఆధ్యర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లా డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. జిల్లాస్థాయిలో పార్టీ బలోపేతం చేయడంపై ప్రత్యేక శిక్షణ తరగతులని, ఎన్నికలకు సమగ్ర సన్నద్ధత, ప్రజలతో అనుసంధానం పెంపే లక్ష్యంగా శిక్షణ తరగతులు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు తెలిపారు.  ఇవాళ్టి నుంచి మార్చి 2వ తేదీ వరకు జరిగే డీసీసీల శిక్షణ తరగతులకు  కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏపీసీసీ జాతీయ అధ్యక్షులు, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.