9 May, 2026 | 1:35 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

బాక్సర్ నిఖత్ జరీన్‌కు రేవంత్ రెడ్డి శుభాభినందనలు

21-11-2025 08:49 AM

పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానం

హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ కప్ తుది పోరులో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు(Telangana boxer Nikhat Zareen) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో (51 కేజీల విభాగంలో) అద్భుత ప్రతిభను ప్రదర్శించి మరోసారి ప్రపంచ వేదికపై దేశ కీర్తిని ప్రపంచ నలుమూలల చాటారని ప్రశంసించారు. ఈ విజయం యువతకు, యువ క్రీడాకారులకు స్పూర్తి దాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో నిఖత్ జరీన్ మరిన్ని శిఖరాలను అధిరోహించాలని అభిలషించారు.

ప్రపంచకప్ బాక్సింగ్ ఫైనల్స్ లో బాక్సర్ నిఖత్ జరీన్ కు స్వర్ణం వరించింది.  గ్రేటర్ నోయిడా లో జరుగుతున్న మహిళల 51 కేజీల ఫైనల్ విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణం గెలిచారు. ప్రపంచ బ్యాక్సింగ్ కప్ ఫైనల్లో 5-0తో గవో యీ గ్జువాన్(చైనీస్ తైపీ)ని నిఖత్ చిత్తు చేసింది. ప్రపంచకప్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో నిఖత్ జరీన్ అదరగొట్టింది. ఫామ్ నిరూపించుకుంటూ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై నిఖత్ జరీన్ ఎదురుదాడి చేసింది. పదునైనా పంచ్ లతో గవో యీ గ్జువాన్ పై విరుచుకుపడింది. దీంతో భారత్ ఖాతాలో మరో 8 పసిడి పతకాలు చేరాయి. 9 స్వర్ణాలు, 6 రజకాలు, 5 కాంస్యాలతో  పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.