9 May, 2026 | 2:32 PM

Breaking News

బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •   తడిసిన ప్రతి గింజ కొనాలి.. ఎకరానికి 20 క్వింటాళ్ల జొన్న కొనుగోలు చేపట్టాలి: ఎమ్మెల్యే   •   పేద ప్రజల సొంత ఇంటి కలలు నిజం చేస్తాం   •   ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం   •   మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •  

నిఖత్ జరీన్‌కు డీజీపీ అభినందనలు

22-11-2025 12:44 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నో యిడాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫై నల్స్‌లో తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన డీఎస్పీ, స్టార్ బాక్సర్ నిఖత్ జరీ న్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడంపై డీజీపీ శివధర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె ను అభినందించారు. గోల్డ్ మెడల్ సాధిం చి, తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిఖత్ జరీన్ నిలిచిందన్నారు. క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన నిఖత్ విజ యం, పోలీసు శాఖలోని ఇతర క్రీడాకారులకు, యువతకు గొప్ప ఆదర్శమన్నారు. నిఖత్ జరీన్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశానికి, రాష్ట్రానికి మరిన్ని విజయాలు అందించాలన్నారు.