4 April, 2026 | 5:52 PM

వేసవిలో తాగునీటి సమస్యపై బోర్ మరమ్మత్తులు

04-04-2026 04:11 PM

సండ్రుగు స్రవంతి సతీష్

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో వేసవిని దృష్టిలో పెట్టుకొని  పట్టణంలోని ప్రజలకు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ప్రత్యేక దృష్టి వహించి పట్టణ కేంద్రంలో కొత్తగా రెండు బోర్లు వేయించడం జరిగిందని చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ అన్నారు. మంచినీటి కోసం ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా, వారికి నీరు అదేవిధంగా ఎండాకాలం మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మంచినీటి బోరును వేశామని   సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రఫీ, వార్డ్ సభ్యులు ఆరీఫ్, సుకెందర్, రహేమ్మొద్దీన్, లింగం, రవి, శ్రీను, శ్రవణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.