18 March, 2026 | 9:45 PM

బిచ్కుంద హోటళ్లపై సివిల్ సప్లై అధికారుల దాడులు

18-03-2026 12:00 AM

16 డొమెస్టిక్ సిలిండర్ సీజ్

బిచ్కుంద, మార్చ్ 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం  ఉదయం  జిల్లా ఓఎస్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ధాబా,టీ పాయింట్, హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్ వాడుతున్నట్టు సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 16 డొమెస్టిక్ సిలిండర్ లను సీజ్ చేశారు. ఎనిమిది మంది హోటల్ యజమానులా పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

అనంతరం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో తనిఖీలు నిర్వహించారు. సీజ్ చేసిన 16 సిలిండర్లను సిలిండర్ గోదాం కు తరలించినారు. గోదాంలో ఉన్న డొమెస్టిక్ సిలిండర్ లను తనిఖీ నిర్వహించి ఎలాంటి అవకతవకలు జరగవద్దని ఏజెన్సీ నిర్వాహకులకు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా డొమెస్టిక్ సిలిండర్లు కొరత దృష్ట్యా హోటల్ లో, డాబాలలో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని ఎవరైనా వాడినచో సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ తనిఖీ లలో జిల్లా సివిల్ సప్లై అధికారులు సుదర్శన్ రెడ్డి, డిప్యూటీ త హాసిల్దార్ సురేష్, ఖలీద్ కానిస్టేబుల్ మోబిన్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.