25 April, 2026 | 9:05 PM

"మాచన" మానవత్వం

25-04-2026 07:47 PM

హైదరాబాద్: నల్గొండ జిల్లా ఓ మారు మూల గ్రామం నుంచి నగరంలో తన కుమారుని ఇంటికి చేరుకునే ప్రయత్నంలో దారి తప్పిన ఓ వృద్ధ మహిళను పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ ఆమె కొడుకు వద్దకు చేర్చి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం తన విధులు ముగించుకుని నగరానికి వస్తున్న క్రమంలో ఎల్బి నగర్ లో ఓ పండుటాకు ఏడుస్తూ కనిపించింది.

ఏమైంది పెద్దమ్మా.! అంటూ పలకరించాడు. నేను నా కొడుకుతానికి పోవాలి నాయినా.. అని చెప్పింది. ఆవిడ వద్ద ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మీ అమ్మ సురక్షితంగా ఉంది. ఎక్కడికి తీసుకురావాలో చెప్పు అంటూ అడిగాడు. నాంపల్లికి తీసుకురండి అని చెప్పాడు. దీంతో ఆమెతో పాటు నాంపల్లికి వచ్చి కొడుకుకు అప్పగించారు రఘునందన్. కంగారు పడకండి అని వారిoచగా.. అమ్మ కాడ వడ్లు అమ్మిన పైసలు ఉన్నాయి సార్. వాటికోసం ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని ఆందోళన చెందా అని చెప్పాడు నగరం లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రమేష్.