25 April, 2026 | 4:38 PM

వాళ్లు వదిలిన బాణమే కవిత: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

25-04-2026 03:11 PM

హైదరాబాద్: ఉపనదులన్నీ సముద్రంలో కలుస్తాయని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... అధికారం కోసం కల్వకుంట్ల కుటుంబం నుంచి కొత్త పార్టీ వచ్చిందన్నారు. అందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి తలో పార్టీ పెట్టారని విమర్శించారు. వాల్లు వదిలిన భాషణమే కవిత అని చర్చ నడుస్తోందని ఏలేటి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గజిని లాగా మర్చిపోయి ఎక్కడ భూములు కినిపిస్తే అక్కడ అమ్ముకుంటున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై రేవంత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.