1 August, 2026 | 1:22 AM

పౌరులు.. హక్కులను వినియోగించుకోవాలి

01-08-2026 12:18 AM

తహసిల్దార్ గోపాల్

కందుకూరు,జూలై 31( విజయ క్రాంతి): సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు తమతమ హక్కులను వినియోగించుకోవాలని కందుకూరు తహసిల్దార్ గోపాల్, కొత్తగూడ సర్పంచ్ బొక్క సువర్ణలు సూచించారు. శుక్రవారం కొత్తగూడ గ్రామపంచాయతీలో  పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తహసిల్దార్,సర్పంచ్ లు మానవ హక్కుల పట్ల ఎలా ఉండాలో ఎలా సద్వినియోగం చేసుకోవాలో అన్నదానిపై గ్రామ ప్రజలకు తెలియజేశారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులపై, బాధ్యతలపై ప్రతి పౌరుడు ఎలా ఉండాలో తెలియజేశారు.హక్కుల పట్ల అశ్రద్ధ వహించొద్దని దశలవారీగా తమకే లాంటి హక్కులు సమాజంలో ఉన్నాయని ప్రతి అణువు అణువునా తెలుసుకొని మెలగాలని వారు సూచించారు.సమాజంలో పౌరులకు గౌరవం ఉన్నప్పుడే మనిషి విలువ పెరుగుతుందని వారు తెలియజేశారు.హక్కుల పట్ల అశ్రద్ధ వహించి హక్కులను ఉల్లంగించవద్దని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ శేఖర్,గ్రామ ఉపసర్పంచ్ ముచ్చర్ల రవీందర్,వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.