సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్
ఘట్ కేసర్, జూలై 31 (విజయక్రాంతి) : పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్, ఘనపురం పరిధిలోని లింగాపురంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు లింగాల భూలక్ష్మి యాదగిరి ఆహ్వానం మేరకు మహేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మేక సంక్షేమ పథకాలను అర్హులందరికీ అమలు చూస్తూ అందిస్తుందని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందెవిధంగా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు ననావత్ రూప్ సింగ్ నాయక్, మమత గౌడ్, గోపాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సత్తయ్య గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశ్వనాధం, సహకార బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఉదయకుమార్ రెడ్డి, ఘనపురం గ్రామ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు రాజుగౌడ్, నర్సింహా, లత రెడ్డి, పాల్గొన్నారు.






