28 August, 2026 | 5:18 PM

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

28-08-2026 02:34 PM

కాగజ్‌నగర్(విజయక్రాంతి): అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శుక్రవారం  అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై  ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ఒత్తిడి తేవాలని కోరారు.రాబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి చర్చకు పట్టుబడతామని ఎమ్మెల్యే తెలిపారు.మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో జూనియర్ లెక్చరర్ల అక్రమ టెర్మినేషన్‌ విషయంలో అండగా నిలిచి తిరిగి ఉపాధి కల్పించేందుకు కృషి చేసినందుకు జేఏసీ నాయకులు ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.