18 July, 2026 | 1:15 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

దేవబండలో ఎండుమిర్చి దొంగతనం

23-12-2025 12:00 AM

అయిజ, డిసెంబర్ 22 : ఐజ మండలంలోని దేవ బండ గ్రామ శివారులో తప్పెట్ల మురుసు గ్రామస్తుల ఎండుమిర్చి దొంగతనం జరిగింది వివరాల్లోకి వెళితే తప్పెట్లమొరుసు గ్రామస్తులైన చింతలకుంట నర్సింహులు,చింతలకుంట పరమేష్ అను రైతులు ఎండు మిర్చి తెంపి పొలములో ఆరబెట్టారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తు లు సుమారు లక్ష 20 వేల రూపాయల (బెగడ రకం  మిర్చి ధర సుమారు క్విం టాకు 40 లేదా 50 వేలు) విలువ గల ఎండు మిర్చి ఎత్తుకెళ్లారని రైతులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. మూడురోజుల క్రితం బింగిదొడ్డిలో ద్విచక్ర వాహనాన్నీ తగలబెట్టడం చూస్తే శత్రువుల పన్నాగమా ? లేక దుండగుల దుశ్చర్యలా ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయని కొందరు స్థానికులు అనుకుంటున్నారు.