ఆపదలో భరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, జూన్ 23 (విజయ క్రాంతి): అనారోగ్యంతో, ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపదలో భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన 107 మంది లబ్ధిదారులకు 29 లక్షల రూపాయ ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక సాయం మంజూరు అయింది.
మంగళవారం గంగాధర ప్రజా కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్లలో బిఆర్‌ఎస్ పార్టీ పంపిణీ చేసిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల కంటే రెట్టింపు చెక్కులను కేవలం రెండేళ్లలోనే పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంత్రి మహేందర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ముద్దం నగేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పురుమల్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి రొమాల రమేష్, కార్యదర్శి రాచమల్ల భాస్కర్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, మాజీ జెడ్పిటిసి సత్తు కనకయ్య, సర్పంచ్ లు రామిడి రాజిరెడ్డి, రాచమల్ల రవి, వేముల భాస్కర్, బీర్ల ఆనంద్, రేండ్ల శ్రీనివాస్, బాసనవేని శ్రీనివాస్, చిందం ఆంజనేయులు, బారాజు ప్రభాకర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






