18 July, 2026 | 1:35 PM

Breaking News

కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్‌ సవాల్‌   •   Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •  

శాసనమండలి భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

08-03-2026 05:54 PM

హైదరాబాద్: చారిత్రక శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శాసనమండలి భవనాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజహరుద్దీన్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మండలిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో రేవంత్ రెడ్డి గారు పూజ నిర్వహించారు.