11 March, 2026 | 2:29 PM

Breaking News

పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •   కేంద్రమాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత.. రాజకీయ రంగంలో విషాదం   •  

సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తి తరతరాలకు ఆదర్శం -ఎమ్మెల్యే జారె

11-03-2026 12:00 AM

దమ్మపేట, మార్చి 10, (విజయక్రాంతి): మంగళవారం అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ గండుగులపల్లిలోని క్యాంపు కార్యాలయం నందు భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళల విద్యకు పునాది వేసిన మహనీయురాలని కొనియాడారు.

తన భర్త జ్యోతిరావు పూలే తో కలిసి బాలికల విద్య కోసం తొలి పాఠశాలను స్థాపించి సమాజంలో అణగారిన వర్గాలకు విద్యా వెలుగులు అందించారని తెలిపారు. మహిళలు చదువుకుని సమాజంలో గౌరవంగా జీవించాలనే లక్ష్యంతో ఆమె జీవితాంతం కృషి చేశారని అన్నారు. సమాజంలో సమానత్వం, విద్యా హక్కుల కోసం ఆమె చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహిళల సాధికారత విద్యాభివృద్ధి కోసం ఆమె చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.