calender_icon.png 19 February, 2026 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాజీ స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి

19-02-2026 02:25:19 PM

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం విజయవంతం

సిద్దిపేట రూరల్ ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని రూరల్ మండలం రాఘవపూర్ లో హైందవ సేన సహకారంతో గణగోని రమేష్ ‘కట్టర్ హిందూ’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజ సేవే లక్ష్యంగా యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ యువత శివాజీ స్ఫూర్తితో సమాజ సేవలోనూ, స్వచ్ఛమైన రాజకీయాల్లోనూ ముందుండాలని పిలుపునిచ్చారు. చిన్న వయసులోనే అనేక రాజ్యాలను జయించి ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన మహానేత శివాజీని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గ్యార పద్మ శ్రీనివాస్, ఉప సర్పంచ్ కంతుల వెంకటేష్, గ్రామ పాలకవర్గ సభ్యులు, కోదాది జ్యోతి, కంతుల రాజు, పడిగే వెంకటేష్,హైందవ సేన అధ్యక్షులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.