1 July, 2026 | 6:53 PM

Breaking News

ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •  

దేశభక్తి, ధైర్యానికి ప్రతీక ఛత్రపతి శివాజీ

13-04-2026 12:00 AM

గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 12: దేశభక్తి, ధైర్యానికి ప్రతీక మహారాజ్ శివాజీ అని మాజీ ప్రభుత్వ విప్  గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని బస్టాం డ్ సమీపంలో విగ్రహ దాత గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,యువకులు ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన చేసేందుకు ఆదివారం భూమిపూజ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సన్మార్గంలో ప్రయాణించాలని పిలుపునిచ్చారు. శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్య సహసాలకు, నిలువెత్తు ప్రతీక అని కొనియాడారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం యువతకు నిత్యం స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో యువత ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిన్నం మల్లయ్య, వార్డు సభ్యులు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.